- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం ధాన్యం కొనడంలేదని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటు : మల్‌రెడ్డి రాంరెడ్డి
దిశ, ఎల్బీనగర్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ మల్‌రెడ్డి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గురువారం పబ్లిక్‌గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం ధర్నా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేమే కొంటున్నామని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనడం లేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తరువాత కేంద్రంతో అమితుమీ తేల్చుకోవాలన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమన్నారు.
సీఎం హోదాలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించకుండా రైతులకు అన్యాయం చేస్తూ సమస్యను మరింత పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతులను అడ్డంపెట్టుకొని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు డ్రామాలు ఆపి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.