- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన బాలిక హత్యాచారంపై మల్లు రవి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సమీపంలోని సైదాబాద్ ప్రాంతంలో గిరిజన చిన్నారిపై హత్యాచారం జరిగి రెండ్రోజులైనా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధకరమని టీపీసీసీ లీడర్ మల్లు రవి విచారం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం బాధకరమన్నారు. గిరిజన బాలిక అంటే అంత అలుసా? అని ప్రశ్నించారు. శనివారం బాధితురాలి కుటుంబాన్ని మల్లు రవి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కేవలం ఒక లక్ష రూపాయలు, కాంట్రాక్టు జాబ్ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు చూస్తుందని ఆరోపించారు. కనీసం దళిత బంధుకు ఇచ్చే పది లక్షల రూపాయలు అయిన ఇవ్వాలేదా? అని మండిపడ్డారు. గతంలోనే ఈ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు అందలేదన్నారు.
సైదాబాద్ ప్రాంతంలో గుట్కా, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు బెల్లయ్య నాయక్, టీజేఎస్ చైర్మన్ కోదండరాం, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.