మిల్క్ బాయ్ బాలీవుడ్ ఎంట్రీ?

by Shyam |
మిల్క్ బాయ్ బాలీవుడ్ ఎంట్రీ?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తోన్న ప్రిన్స్ బాలీవుడ్‌ను కూడా ఏలేందుకు రెడీ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. త్వరలోనే మహేష్ హిందీ సినిమా అరంగేట్రం కన్ ఫాం అయ్యే ఛాన్స్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మహేష్‌బాబు సినిమాలను చూసి మిల్క్ బాయ్ కటౌట్, యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌కు పడిపోయారట హిందీ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా. దీంతో మహేష్‌తో మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడట. సౌత్‌లో మహేష్ క్రేజ్ చూసి పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌తోపాటు బాలీవుడ్ గల్లీబాయ్ రణ్‌వీర్ సింగ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. కానీ, బాలీవుడ్‌ సినిమాలు చేసేందుకు అంతగా ఇష్టం లేదని చెప్పిన ప్రిన్స్ సినిమాకు ఓకే చెప్పాల్సి ఉంది.

బాలీవుడ్‌లో తామేంటో ప్రూవ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుగు యంగ్ హీరోస్. ఇప్పటికే అల్లు అర్జున్ ఖచ్చింతగా హిందీ సినిమా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలపగా … రాం చరణ్, ప్రభాస్ ఆల్రేడీ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో హిందీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం పూరీ, కరణ్ జోహార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీతో బాలీవుడ్ ఎంట్రీ.

Advertisement

Next Story