పోలీసులకు సోనూ సాయం

by Anukaran |   ( Updated:2020-07-17 01:01:38.0  )
పోలీసులకు సోనూ సాయం
X

సోనూ సూద్ భారత్ మెచ్చిన రియల్ హీరో. ఆపద సమయంలో వలస కూలీలను అక్కున చేర్చుకున్న ఆపద్బాంధవుడు. కరోనా కాలంలో వారిని సొంత గూటికి చేర్చిన మనసున్న మారాజు. వారి కష్టాలు విని 400 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చిన దయాహృదయుడు. తమ ప్రాణాలకు తెగించి మరి వైద్యం అందిస్తున్న డాక్టర్లకు విశ్రాంతి కోసం తన హోటల్‌ను వినియోగించుకోవచ్చని తెలిపిన బంగారం సోనూ సూద్.

ఇన్ని చేసిన సోనూ ఇప్పుడు మరోసారి సెల్యూట్ చేసే పని చేశాడు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తయారుచేసిన 25,000 ఫేస్ ఫీల్డ్స్ అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన మహారాష్ట్ర మంత్రి అనిల్ దేష్ ముఖ్ .. సోనుకి థాంక్స్ చెప్పారు. సోనుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మంత్రి.. సోనూ సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story