మహారాష్ట్ర పోలీసులకు రెస్ట్..!

by vinod kumar |
మహారాష్ట్ర పోలీసులకు రెస్ట్..!
X

ముంబై: లాక్‌డౌన్ కారణంగా విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులకు రెస్ట్ ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 20 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు నుంచే అంటే మార్చి 22 నుంచే మహారాష్ట్ర పోలీసులు నిర్విరామంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2,000 మంది కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపించాలని విజ్ఞప్తి చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్ కాలమంతా… పోలీసులు రేయింబవళ్లు రోడ్లపైనే విధులు నిర్వహించారని ఆయన అన్నారు. 50 రోజులకు మించి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న రాష్ట్ర పోలీసులు డ్యూటీ ఒత్తిళ్లతో అలసిపోతున్నారని చెప్పారు. ఈ తరుణంలోనే ఈద్ పండుగ సమీపిస్తున్నదని చెబుతూ.. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు భద్రతా సిబ్బంది అత్యావశ్యకమని అన్నారు. అందుకే కేంద్ర బలగాలను కోరుతూ విజ్ఞప్తి చేశామని అన్నారు. 2,000 మంది సీఏపీఎఫ్ బలగాలను పంపించాలని అభ్యర్థించినట్టు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed