ఆ రాష్ట్రంలో 10, 12వ తరగతి పరీక్షలు రద్దు

by Shamantha N |   ( Updated:2021-04-14 03:39:48.0  )
ఆ రాష్ట్రంలో 10, 12వ తరగతి పరీక్షలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంలో 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story