కరోనా ఎఫెక్ట్: మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ

by Shamantha N |   ( Updated:2021-03-13 08:45:15.0  )
కరోనా ఎఫెక్ట్: మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు ఇవాళ దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్‌లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రకటించారు. ఆదివారం లేదా సోమవారం రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story