‘పవన్ ఏది చేసినా రైట్ రైట్ అనను’

by Anukaran |
‘పవన్ ఏది చేసినా రైట్ రైట్ అనను’
X

దిశ, వెబ్‌డెస్క్: డియర్ పవన్ కళ్యాణ్ అంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత అనూహ్యంగా లేఖ రాశారు. ఎప్పుడూ లేని విధంగా భారీ లేఖను ఆమె రాయడం ఇదే తొలిసారి. ఓ వైపు పవన్ పై అభిమానం ఉందన్న ఆమె.. ఆయన చేసే వాటికి పూర్తి మద్ధతు కూడా ఇవ్వలేనన్నారు. కొన్నింటిపై పవన్ పోరాడాల్సిందే అంటూ గుర్తు చేశారు.

సినీనటి మాధవీలత పవన్ కల్యాణ్‌కు ఫేస్‌బుక్‌లో బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు నేను మీకు ఒక్క పోస్ట్ కూడా డైరెక్ట్‌గా పెట్టలేదు. మీమీద ఎనలేని ప్రేమన్నట్లు మీ అటెన్షన్ కోసం కొందరేవో చేస్తే వారందరికీ మీరు సమాధానమివ్వడం హాస్యాస్పదం. మీరంటే నాకున్న అభిమానం ఎప్పటికీ పోదు. అలాగని మీరేం చేసినా రైటోరైట్ అని స్టేట్మెంట్స్ పెట్టను.

మీకు మద్దతుగా నిలవని వాళ్లు మీకోసం ఎప్పుడూ మాట్లాడని వాళ్లు ఈరోజు ప్రేమ కారుస్తుంటే మీరు బకెట్లో నింపుకుంటున్నారు. మీ నిజమైన అభిమానులకు రిప్లై ఇవ్వండి చాలు. టైం ఉంటే మీ జన సైనికులకు పేరుపేరునా పోస్ట్ పెట్టండి.. వీలైతే సినిమా ఇండస్ట్రీలో చెత్తను క్లీన్ చేసేందుకు ప్రయత్నించండి.. మిమ్మల్ని గెలిపించని ప్రజల సంగతి తర్వాత చూద్దురుగానీ.. ఇండస్ట్రీలో అత్యాచారాలు, డ్రగ్స్ మీద పోరాటం మొదలు పెట్టండి. నేను వేరే పార్టీలో ఉన్నా మీకోసం గొంతు వినిపిస్తూనే ఉన్నాను.. మీరంటే అంత అభిమానం నాకు అంటూ.. మధవీలత అన్నారు.

Advertisement

Next Story