'కరోనా సంక్షోభంలోనూ మాకు లాభాలొచ్చినయ్'

by Harish |
కరోనా సంక్షోభంలోనూ మాకు లాభాలొచ్చినయ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ 2019-20 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.427.5 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2018-19 ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 378.5 కోట్లతో పోలిస్తే 12.9 శాతం పెరిగింది. నికర ఆదాయం రూ. 21.2 శాతం వృద్ధితో రూ. 3,011.9 కోట్లకు చేరినట్టు పేర్కొంది. త్రైమాసిక పరంగా చూస్తే, డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే లాభం 13.5 శాతం, ఆదాయం 7.1 శాతం వృద్ధి సాధించినట్టు సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ఎల్‌టీఐ సీఈవో, ఎండీ సంజయ్ మాట్లాడుతూ..కరోనా సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనూ వినియోగదారుల అంచనాలను మించి పనిచేశామని, వరుస నాలుగో ఏడాది రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపారు. మార్చి త్రైమాసికంలో సుమారు రూ. 7,530 కోట్ల విలువైన రెండు భారీ కాంట్రాక్టులను సాధించామన్నారు. తుది డివిడెండుగా ప్రతి షేర్‌కు రూ. 15.50ను డైరెక్టర్ల బోర్డు సిఫారస్సు చేసింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 10,878.6 కోట్లతో 15.2 శాతం వృద్ధి సాధించగా, నికర లాభం రూ. 1,520.5 కోట్లతో 0.3 శాతం పెరిగినట్టు కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed