ఆ భయంతో.. ప్రియురాలు మృతి.. షాక్‌లో ప్రియుడు

by srinivas |   ( Updated:2021-07-01 03:23:24.0  )
ఆ భయంతో.. ప్రియురాలు మృతి.. షాక్‌లో ప్రియుడు
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ ఘటనలో ప్రియురాలు మరణించగా ప్రియుడు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే గూడూరుకు చెందిన తేజస్విని, వెంకటేశ్‌లు ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఒకే ఇంట్లో ఉరివేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story