- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ తొలి జాబితాకు ముహూర్తం ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో రంగంలోకి దించారు. కానీ, అధికార కాంగ్రెస్ మాత్రం ఒక్క మహబూబ్‌నగర్ అభ్యర్థిని తప్ప ఎవరినీ ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం శ్రేణుల్లో కన్‌ఫ్యూజన్ నెలకొంది. అయితే, తాజాగా.. లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7 లేదా 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. తమ కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలు తాను ఎంకరేజ్ చేయను అని అన్నారు.
కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరు సొదరులు మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్తలకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. అనంతరం బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా మాజీ సీఎం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారని నిలదీశారు. దేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్దన్న అవుతారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన మిత్రుడేనని.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే ఏమి కాదన్నారు. తమ ప్రభుత్వ పరిపాలన రిఫరెండంగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. 14కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More..
‘మోడీ’ న్యూస్‌ను రీ ట్వీట్ చేసిన సీఎం రేవంత్? ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు