లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినత‌రం

by Sridhar Babu |
లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినత‌రం
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం జిల్లాలో ఆదివారం నుంచి లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎం.వి.రెడ్డి స్ప‌ష్టం చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతినిస్తామనీ, అదీ ఒక్కరు మాత్రమే దుకాణాలకు రావాలని సూచించారు. 12 గంటల తరువాత దుకాణాల‌న్నీ తప్పని సరిగా మూసేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌నీ, రోడ్లపైకి వచ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

tags: lockdown, bhadrachalam, collector mv reddy, vehicles seize, coronavirus,

Advertisement

Next Story