తొలి రోజు నమోదైన నామినేషన్లివే..!

by srinivas |
తొలి రోజు నమోదైన నామినేషన్లివే..!
X

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల కళ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. పలు పార్టీలకు చెందిన నేతలు తొలి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉత్సాహం చూపారు.

జిల్లాల వారీగా తొలి రోజు దాఖలైన నామినేషన్ల వివరాల్లోకి వెళ్తే…
శ్రీకాకుళం జిల్లా జడ్పీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి.
విజయనగరం జిల్లా జడ్పీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకి 9 దరఖాస్తులు నమోదు కావడం విశేషం.
తూర్పుగోదావరి జిల్లాలో జడ్పీటీసీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు 93 నామినేషన్లు దాఖలయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీటీసీ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు 61 నామినేషన్లు దాఖలయ్యాయి.
కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు 50 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ తీవ్ర గందరగోళం నడుమ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సమాచారం అందక పలువురు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చి, నిరుత్సాహంగా వెనుదిరిగారు. గుంటూరు జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయగా, 32 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
ప్రకాశం జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు ఆరు నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు 43 నామినేషన్లు దాఖలయ్యాయి.
కర్నూలు జిల్లాలో కేవలం ఎంపీటీసీ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి.
కడప జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు 6 నామినేషన్లు దాఖలవగా అవన్నీ వైఎస్సార్సీపీ అభ్యర్థులు వేసినవే కావడం విశేషం.
చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. జడ్పీటీసీ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలు కాగా, ఎంపీటీసీ స్థానాలకు అత్యధికంగా 213 నామినేషన్లు దాఖలయ్యాయి.
అనంతపురం జిల్లాలో కేవలం ఎంపీటీసీ స్థానాలకు తొలిరోజున 78 నామినేషన్లు దాఖలు కావడం విశేషం.

Advertisement

Next Story