- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్థానికం కఠినం..కట్టుతప్పితే కటకటాలే!
అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గంటన్నరపాటు జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టు మంత్రి పేర్నినాని మీడియాకు వెల్లడించారు.మార్చి15లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, డబ్బు, మద్యం పంచుతూ పట్టుబడినా వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అలాగే వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.గ్రామాల్లో పచ్చదనం,పారిశుధ్యం బాధ్యత సర్పంచ్‌లదేనని, వారంతా స్థానికంగా నివాసముండాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.పంచాయతీ ఎన్నికలకు 5రోజులు, ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలకు 8రోజులు ప్రచార సమయంగా నిర్దారించామని పేర్కొన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన పండ్ల తోటలు, పంటలకు కలిగే నష్టానికి పరిహారం పెంచామన్నారు. అంతేకాకండా ముఖ్యమైన ఏపీ గ్రీన్‌ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ముసాయిదా బిల్లు, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం జగనన్నవిద్యాకానుక అమలుపై చర్చ జరిపి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ, రెండు జతల బూట్లు,పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. 10వేల మెగావాట్లతో ఏర్పాటు చేయాలనుకుంటున్న సౌరవిద్యుత్ ప్లాంట్‌కు కేబినెట్ ఆమోదం లభించిందని వివరించారు.