మొదటిసారి ముద్దెట్టితే

by Ravi |   ( Updated:2024-11-10 23:15:59.0  )
మొదటిసారి ముద్దెట్టితే
X

అవును

మొదటిసారి ముద్దెట్టితే

ఎక్కడ పెడతావంది తాను

అందమైన ఆకాశాన్ని

ఎక్కడ ముద్దాడితేనేం అన్నాను

చిన్నగా నవ్వి నేను

నిన్ను ముద్దాడటం

ఆకాశాన్ని ముద్దాడటంగానే ఉందన్నాను

అవును.. నేను లేకుండా

ఉండలేవా అంది తాను

కొమ్మనిడిచిన పువ్వు

నువ్వు లేని నేను

ఒక్కతీరే అన్నాను

అవును.. మనం కలిసి

నడవడమెందుకు అంది తాను

పూల వాసన, గాలి

విడివిడిగా ప్రయాణించలేవు అన్నాను

అవును

నేనంటే ఏంటి నీకు అంది తాను

నా పగలు రేయనీ అన్నాను నేను

అవును

మేమంటే భూమి ఆకాశం

మేమిద్దరం

ఒకటిగా కనిపించే చెరో విశ్వం

దిలీప్.వి

84640 30808

Advertisement

Next Story