వెలుగు

by Ravi |   ( Updated:2024-11-03 23:31:10.0  )
వెలుగు
X

ప్రమిదల వొత్తులు విరజిమ్మే

ఆనందాల వెల్లువ

మనిషిని మనిషి కలువడం అరుదైన కాలంలో

కొడుకు పొడ ఆమడంత దూరంలో

అయినా పిల్లలతో తండ్రి నమ్మిక

అమ్మ సంతోషం నేటిదా?

ఇదే మొదలూ కాదు చివరిదీ కాదు

అదే అనంతం ఇదే వసంతం

బంధాలూ స్నేహాలు అన్నీ ఎండమావి

సామాజిక బంధం ప్రతిచోట

ఇప్పుడు ఎండిన వేరు పగిలిన ఘటం

ఊపిరింకా గాలి కాలేదు సఖా

ఎక్కడో ఆశ మినుకు మినుకు

కళ్ళలో చుక్క తళుకు తళుకు

ఇప్పుడు వెలుగే కదా కవిత్వం

ఇక్కడ ఒకటొకటిగా

దీపం వొత్తులు హత్తుకున్నవి

దీపావళి గుండెల

శిరమెత్తిన కలం

ఎలుగెత్తిన గొంతు తొడుక్కున్న కొత్త కాంతి

బంధాల కదంబం పెనవేసే

కుటుంబ హేల ఈనాటి దీపావళి

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

98493 05871

Advertisement

Next Story