- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొన్నిసార్లు...
కొన్నిసార్లు...
నేను గత కాలంలోకి వెళితే బావుంటుందనిపిస్తుంది
విషయాలను మార్చటానికి కాదు.. కానీ
కొన్నిటిని రెండవసారి అనుభూతి చెందటానికి.
కొన్నిసార్లు...
నేను శిశువునైతే బాగుండునని కోరుకుంటాను
చక్రాల తోపుడుబండిలో వెళ్లాలని కాదు...కానీ
మా అమ్మ చిరునవ్వు చూడటానికి
కొన్నిసార్లు...
నేను మళ్లీ స్కూల్‌కి వెళితే బాగుండనిపిస్తుంది
చిన్న పిల్ల వాణ్ణి అవ్వాలని కాదు కాని
స్కూల్ వదిలిన తర్వాత ఎప్పుడూ
కలవని నాటి స్నేహితులను కలవటానికి
కొన్నిసార్లు...
నేను మళ్ళీ కాలేజీకి
తిరిగి వెళ్లగలిగితే బాగుండుననిపిస్తుంది,
ఎదిరించేవాడిగా ఉండాలని కాదు,
నిజంగా నేనేం చదివానో అర్థం చేసుకోవటానికి
కొన్నిసార్లు...
నా ఉద్యోగంలో కొత్తవాడి నవ్వాలనిపిస్తుంది
తక్కువ పని చేయటానికి కాదు...కాని
మొదటి జీతం చెక్‌ని తీసుకున్న
ఆనందాన్ని గుర్తు చేసుకోవటానికి
కొన్నిసార్లు...
నా పిల్లలు చిన్నవాళ్లుగా
ఉండాలని కోరుకుంటాను, వాళ్ళు తొందరగా
పెద్దవాళ్ళు అవకూడదని కాదు... కాని
వాళ్లతో ఇంకా ఎక్కువగా ఆడుకోవాలని
కొన్నిసార్లు...
నేను ఇంకా ఎక్కువకాలం
జీవిస్తే బాగుండునని కోరుకుంటాను,
దీర్ఘాయువు కావాలని కాదు...కాని
ఇతరులకు ఏమివ్వగలనో తెలుసుకోవటానికి
గడిచిపోయిన సమయాలు తిరిగిరావు..
ఇప్పటి నుండి మనం జీవిస్తున్న క్షణాలను
పూర్తిగా ఆనందిద్దాం
మన శేష జీవితాన్ని, ప్రతి క్షణాన్ని...
ప్రతి రోజుని వేడుక చేసుకుందాం!
-రాబర్ట్ డ్రేక్
అనువాదం
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
- Tags
- Poem