- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారం వారం మంచి పద్యం: తప్పు
బుంగి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఒకరోజు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య సెల్‌ఫోన్ నుండి గొంతుమార్చి అమ్మతో ఇలా అన్నాడు. ‘అమ్మా, ఇంట్లో బుంగి ఉన్నాడా’ ‘లేడు, బయట కెళ్ళినట్లున్నాడు’ ‘వాడికి తిరుగుడు ఎక్కువైంది. కాలేజీ ఎగ్గొడుతున్నాడు. చదువు అటకెక్కింది. సంస్కారం కొండెక్కింది’. ‘లేదురా, వాడికి స్నేహితులు తక్కువ. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్తున్నాడు. ఇంటికొచ్చాక చక్కగా చదువుకుంటాడు’. ‘థ్యాంక్స్ అమ్మా, నా గురించి నేను తెలుసుకోవాలని అన్నయ్యలా గొంతు మార్చి మాట్లాడాను’. ‘నిన్ను నీవు తెలుసుకోవడానికి నీలోకి తొంగి చూడు. నాటికి నేటికి నీలో వచ్చిన మార్పును అంచనా కట్టు. అంతేకానీ నన్ను ఇలా పరీక్షించడం మోసం అవుతుంది. ‘తప్పు చేశావు నీవు’ ‘సారీ అమ్మా ఇంకోసారి ఇలా చేయను, పది నిమిషాల్లో నీ ముందుంట’ అంటూ పరుగెత్తాడు.
తనను తాను తెలుసుకోను తనను కన్న
తల్లి తోడను మాటాడి తప్పు చేసి
లోన పరికింప తెలియును లోని తప్పు
కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము
డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732
- Tags
- Poem