- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ ‘క’.. అక్కడే చూడాలంటూ క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గత ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, రూల్స్ రంజన్(Rules Ranjan), మీటర్ వంటి చిత్రాలతో వచ్చిన కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ అందుకోలేక పోయాడు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘క’(ka). సుజీత్(Sujeet), సందీప్(Sandeep) కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Srichakras Entertainments)పై నిర్మించారు. ‘క’ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద ఊచకోత స్టార్ట్ చేసి భారీ కలెక్షన్లు రాబడుతోంది. సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో.. ‘క’ అప్పుడే ఓటీటీ(OTT)లోకి రాబోతుందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి కూడా రాబోతున్నట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాటిని వారంతా ఫుల్ ఖుషీ అయిపోయారు.
ఈ క్రమంలో.. తాజాగా, ‘క’ నిర్మాణ సంస్థ శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Srichakras Entertainments) ‘X’ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ‘‘ఇప్పట్లో ‘క’ సినిమా ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పుడు రూమర్స్ రావడం పర్లేదు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది కూడా వైరల్ చేసేయడం చేజేతులా వసూళ్లను అడ్డుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు.
#KA We are not coming to OTT any time soon..we want you all to experience our movie in theatres only. Please discard any fake news in this regards
— srichakraas entertainments (@srichakraas) November 6, 2024