India – Bhutan: భారత్ – భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-07 05:44:18.0  )
India – Bhutan: భారత్ – భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ – భూటాన్(India – Bhutan) మధ్య నేడు చారిత్రక పరిణామం చోటుచేసుకోనుంది. అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు చేయనున్నారు. ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’(Immigration Check Post)ను భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్‌తో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Home Minister Bandi Sanjay Kumar) ఇవాళ(గురువారం) ప్రారంభించనున్నారు. దీంతో సరిహద్దులో అసోం పోలీసు, భద్రతా దళాల భారీగా మోహరించారు. ఈ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌తో ఇరు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. భారత్‌కు లాజిస్టిక్ ఖర్చుల భారం తగ్గనుంది. ఇరుదేశాల మధ్య ప్రజా సంబంధాలు పెరగనున్నాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలు ‘‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’’తో సులభతరం కానుంది. మరికాసేపట్లో అసోం సరిహద్దులో భూటాన్ ప్రధాని శెరింగ్ టోబ్‌గే, కేంద్ర మంత్రులు బండి సంజయ్, పవిత్ర మార్గరీటా, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed