మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లే!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-07 08:43:13.0  )
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ (Heart attack) వచ్చి చనిపోయేవారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. కసరత్తులు చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తూ, క్లాస్‌‌రూమ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

అయితే, ఈ గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తి తీవ్రమైన ఛాతీ నొప్పి, వెన్నునొప్పిని అనుభవిస్తాడని.. ఈ రోజుల్లో ఏ వయసు వారికైనా ఇలా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటు వచ్చే కొన్ని గంటల ముందే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అలా వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆ లక్షణాలు ఏంటో కింద చూసేయండి.

ఎలా మొదలవుతుంది? :

*హార్ట్ ఎటాక్ వచ్చే గంట ముందే ఛాతిలో నొప్పి మొదలవుతుంది. శరీరమంతా ఆకస్మాత్తుగా ఒత్తిడి (Pressure)కి లోనైనట్లు అనిపిస్తుంది. ఇలా అనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

* గుండెపోటు వచ్చే ముందు ఎడమ భుజం, మెడ వెనుక భాగంలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. తరువాత దవడ, కుడి చేతి వరకు ఈ నొప్పి కలుగుతుంది. ఆ వెంటనే చెమటలు పట్టడం ప్రారంభవవుతుంది. ఈ లక్షణాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

* అకస్మాత్తుగా మైకం రావడం, ఏ పని చేయకుండానే శరీరమంతా అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం. ఇటువంటివి లక్షణాలు తరుచుగా కనిపిస్తున్నప్పడు వైద్యుడిని సంప్రదించాలి.

అయితే, హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఈ లక్షణాలు మీలో కనిపిస్తే, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సే కరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Read More..

Winter Health : చలికాలంలో ఆర్థరైటిస్‌ను పెంచే ఆహారాలు.. వీటిని తీసుకోకపోవడమే బెటర్!

Advertisement

Next Story

Most Viewed