కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్..

by Sumithra |
కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్..
X

దిశ, కొండాపూర్ : మండలంలోని మల్కాపూర్, తోగర్ పల్లి సొసైటీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం, సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు వరి ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం, పాలిథిన్ సంచులు సమకూర్చాలని తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీసీఒ, అగ్రికల్చర్ ఏవో గణేష్, తహశీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్, ఏఈవో వయోలా, ఏఎంసీ చైర్మన్ కుమార్, సొసైటీ చైర్మన్ పవన్ కుమార్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story