CM Revanth Reddy: జనగణనతో పాటు కులగణన జరపాలి: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |
CM Revanth Reddy: జనగణనతో పాటు కులగణన జరపాలి:  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగ పవిత్రతను కాపాడింది కాంగ్రెస్ పార్టీనే అని, ప్రతి ఒక్క వర్గాలకు సామాజికి న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారమే తెలంగాణలో కులగణన జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో 92 శాతం కులగణన (Caste Senses) పూర్తయిందని వెల్లడించారు. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక్షణ్ అభియాన్ (Samvidhan Rakshak Abhiyan) కార్యక్రమానికి సీఎం రేవత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాపాడింది కాంగ్రెస్సే అన్నారు. కులగణనతో దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తుందని రాజ్యాంగ పరిరక్షణలో గాంధీ పరివారం ప్రయత్నం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ వెంటే దేశ ప్రజలు ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ చెబుతున్న కులగణన సమాజానికి ఎక్స్ రే మాత్రమే కాదని ఇది సమాజం యొక్క మెగా హెల్త్ చెకప్ అన్నారు. కులగణన విషయంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed