- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. రమ్య గ్రౌండ్స్ లో క్లీనింగ్ పనులు చేయించిన కాంగ్రెస్ నాయకులు...
దిశ, కూకట్ పల్లి : రమ్య గ్రౌండ్ ఎవరిది...? అన్న శీర్షికన దిశ పత్రికలో ప్రచురితం అయిన వార్తకు స్పందించారు కాంగ్రెస్ యువజన నాయకులు శివ చౌదరి. ఈ మేరకు జీహెచ్ఎంసీ మూసాపేట్ సర్కిల్ పారిశుద్ధ్య విభాగం అధికారులకు సమాచారం అందించి రమ్య గ్రౌండ్ లో పేరుకు పోయిన చెత్త, చెట్ల కొమ్మలను తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శివ చౌదరి మాట్లాడుతూ రమ్య గ్రౌండ్ పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యత జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం చేపట్టాల్సి ఉందన్నారు.
కానీ స్పోర్ట్స్ విభాగం అధికారులు అలసత్వం వహిస్తుండటంతో గ్రౌండ్ లో చెత్త చెదారం పేరుకు పోయింది, గ్రౌండ్ చుట్టూ పరిసరాలు అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. స్పోర్ట్స్ విభాగం అధికారి ఆనంద్ తో మాట్లాడి గ్రౌండ్ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కోరినట్టు తెలిపారు. గ్రౌండ్ లో చెత్తను పారిశుద్ధ్య విభాగం అధికారి డాక్టర్ కార్తీక్ నేతృత్వంలో ఎస్ఆర్పీ శ్రీనివాస్ సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లి పాల్గొన్నారు.