131 ఏళ్ల అమెరికా చరిత్రను తిరగరాసిన ట్రంప్

by Mahesh |
131 ఏళ్ల అమెరికా చరిత్రను తిరగరాసిన ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 295 ఎలక్ట్రోరల్ ఓట్లతో గెలిచారు. దీంతో ఆయన రెండోసారి అమెరికా(America) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విజయంతో ట్రంప్(Trump) అమెరికా 131 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు. రెండు వేర్వేరు పర్యాయాల్లో అమెరికా అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైన వ్యక్తిగా ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా గతంలో చాలా మంది రెండు సార్లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్ జార్జ్ బుష్, ఒబామా ఉన్నారు. అయితే వీరంతా వెంట వెంటనే రెండు సార్లు అధ్యక్షులగా విజయం సాధించగా.. ట్రంప్ మాత్రం రెండు వేర్వేరు పర్యాయాలు అంటే 2016 నుంచి 20 మధ్యలో ఒక సారి, ప్రస్తుతం మరోసారి ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ట్రంప్ కంటె ముందు 131 సంవత్సరాల క్రితం.. గ్రోవర్ క్లీవ్ లాండ్ (188589, 1893-97) మధ్యకాలంలో రెండు వేర్వేరు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed