Jammu&Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రసాభాస.. ఎమ్మెల్యేల బాహాబాహీ

by Rani Yarlagadda |   ( Updated:2024-11-07 05:42:18.0  )
Jammu&Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రసాభాస.. ఎమ్మెల్యేల బాహాబాహీ
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ లో (Jammu&Kashmir) నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతోన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) రసాభాస జరిగింది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై (Article 370) ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ (MLA Khursheed Ahmad Shiekh) బ్యానర్ ను ప్రదర్శించడమే ఈ దాడికి ప్రధాన కారణమైంది. ఖుర్షీద్ అహ్మద్ చేసిన పనిపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలుపగా.. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలంతా ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో.. అసెంబ్లీని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(National Conference), కాంగ్రెస్ పార్టీలు (Congress Party) జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయమిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా ఆరోపించారు. కాంగ్రెస్ పాక్ తో చేయి కలిపిందని, ఉగ్రవాదంతో చేయి కలిపిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story