వారం వారం మంచి పద్యం:రీతి

by Ravi |
వారం వారం మంచి పద్యం:రీతి
X

కాలక్రమంలో బుంగి సెలబ్రిటీ అయ్యాడు. సమకాలీనులలో ముందున్నాడు. మార్గదర్శిగా ఒకచోట, మేధావిగా అంతటా తనదైన రీతిలో జీవిస్తున్నాడు. ఉద్యోగిగా అధికారులు, తోటివారు, పనికోసం తన వద్దకు వచ్చే వారి మన్ననలు అందుకున్నాడు. అలాంటి వాడిపై మీడియా కన్ను పడింది. అతడిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రముఖ ఛానల్ జర్నలిస్టులు వచ్చారు. అది ఇలా సాగింది.

'నమస్కారం సార్, మాకు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు' నేనంత బిజీగా ఏం లేను. ఇది కూడా నా బాధ్యతగా భావిస్తున్నాను. 'ప్రభుత్వ ఉద్యోగులలో పని పట్ల అలసత్వం, నిర్లక్ష్యం ఎక్కువ, మీరేమంటారు?' మీరు నిరూపించగలరా? మీరన్నదే నిజమైతే దానికి కారణం చెప్పగలరా? 'మీడియా ఎన్నోసార్లు నిరూపించింది. ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేసరికి ఎక్కడా లేని నిర్లక్ష్యం, అలసత్వం వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగులందరి పరిస్థితి అలాగే ఉంది' అది కేవలం మీడియా అభిప్రాయం. ప్రజల మాట కాదు. జరుగుతున్న పనులన్నీ ఉద్యోగులు చేస్తున్నవే కదా? 'ప్రజల మాటను మేం వినిపిస్తున్నాం. మీరు ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తున్నారు. మీలాంటివారు కూడా చర్చను పక్కదారి పట్టిస్తే ఎలా?' అందుకే చెబుతున్నా ఏ వ్యవస్థలోనూ సంపూర్ణ మంచి ఉండదు. అంతా పాక్షికమే. వ్యవస్థలోను వ్యక్తిలోనూ ఎక్కువ చెడు ఎదగకుండా జాగ్రత్త పడటమే ప్రతి వ్యక్తి, సంస్థ చేయవలసింది అన్నారు బుంగి.

కడుపు నిండని మనిషికి కూడు కొరత

కూడు ఎక్కువ మనిషికి నిదుర కొరత

రీతి తెలిసిన మనిషికి కీర్తి వెలుగు

కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము

డా.బివిఎన్ స్వామి

Advertisement

Next Story