- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తరలి వచ్చిన బృందావనం.. నా కల - నా స్వర్గం
రచయిత్రికి చిన్నప్పటి నుండి తెలుగు భాషంటే మమకారం. అందరికీ అమ్మే తొలి గురువు.. నాకూ కూడా అమ్మే నా తొలి గురువు. అంటూ మొదటిసారిగా అమ్మ నేర్పిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో తన సాహిత్యాభిమానాన్ని పెంచుకొన్న గుంటూరు వాస్తవ్యురాలు ‘గజల్ కవయిత్రి గోలి విజయ’ ఆమె రచించిన ‘నా కల - నా స్వర్గం’ విభిన్న అంశాలతో పొందుపరచబడినది. అలాగే కవయిత్రి విజయ చిన్నప్పటినుండే అమ్మ చెప్పిన కధలు వినడం, చందమామ కథలు చదవటం మొదలుగా మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొని . కాలేజి కొచ్చిన తర్వాత ప్రముఖ కవుల పుస్తకాలు చదవడం, లలిత సంగీతం వినటం చాలా ఇష్టంగా మారింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలంటే చాలా అభిమానాన్ని పెంచుకున్నది. వివిధ సాహితీ సమూహాలలో నాకు ఈ రచయిత్రి స్వయంగా పరిచయం.
సహజమైన సందర్భాన్ని కళ్లకు చూపి..
ఇట్టి కవితా సంపుటిని పరిశీలించగా.. పరిపక్వత చెందిన కవిత్వంతో, లోతైన అధ్యయనంతో, వస్తువు ఎంపికలో తనదైన ప్రత్యేకతను వ్యక్తీకరిస్తూ రచించింది కవయిత్రి. ‘నవ్వు కవితలో... నవ్వుకు ప్రతి నవ్వు పువ్వు లాంటి కానుక/మనసు తీర మల్లెలా నవ్వ గలగటమే/ మహిలో మనిషికి మహా యోగం, ఎన్నో సమస్యలకు అసలైన పరిష్కారం/ మౌనాన్ని మైనంలా కరిగించేది చిద్విలాసం అంటూ నవ్వు చెప్పిన వివిధ అర్థాలను వాటిలోని మధుర భావాలను అందులో నుంచి వ్యక్తం అయ్యే అనుబంధాలను తెలియజేస్తూ ఒక ఊహా ప్రపంచాన్ని నవ్వు ప్రతి జీవి నుండి వ్యక్తం అవుతుందని తెలియజేసినది. అలాగే ఆత్మీయ నేస్తం కవితలో.. పుస్తకమంటే వాగ్దేవీ కరదీపిక అలరారు ఆ భూషణమే అజ్ఞాన తిమిరాన్ని పారదోలే అభ్యుదయ మార్గాన వెలుగు రేఖలు పంచు అఖండ విజ్ఞాన జ్యోతులు పెద్దలు రాసిన పుస్తకాలే కద /మనకు బుద్ధులు నెరిపినవి/ ఆదర్శమై ఆదరణ చూపినవి/ బ్రతుకుదారిన భావి చూపినవి అంటూ... సరస్వతీ మాత కటాక్షంతో విద్య అనేది ఒక జ్ఞానంతో కూడినదని ప్రతి వ్యక్తికి ఒక మార్గదర్శకాన్ని చూపించేది, ఉన్నత శిఖరాల వైపుకు నడిపించేది కూడా పుస్తకమేనని కవయిత్రి వ్యక్తం చేశారు. అలాగే అమ్మభాష కవితలో... మధురమైన భావాలను మనసు తీర పలికించే భాష/ అమ్మ అనే పిలుపులోని మమత/ నాన్న అనే పిలుపులోని సమత/ వావి వరుసల వలపు పిలుపుల సరి/ మాతృభాషను గాక మరి ఎక్కడ పరిమళించు అంటూ ఈ కవితలో అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ నవమాసాలు కనిపించిన మాతృమూర్తి గురించి తెలియజేస్తున్నది. బయటి ప్రపంచంలో కూడా మనసు భావాలను, మనిషిని అతి దగ్గర నుండి స్పృశించే శక్తి కలిగినది అమ్మేనని ఆ మధురమైన పిలుపు అమ్మేనని తెలియజేసింది. అలాగే అప్పగింతలు కవితలో...
మెట్టినింటికి బిడ్డను అప్పచెప్పే వేళ అమ్మ నాన్నల గుండెలవిసి పోయెను అన్నదమ్ముల మోము కళ దప్పిపోయేను. ఆడపిల్లవే నీవంటూ అతిథి ఈడ నీవంటూ.... మక్కువతో పెంచాము మా ఇంటి లక్ష్మిని/ మనసార మీకు అప్పగించేము, తప్పొప్పులెంచొద్దు/ తను చిన్నపిల్ల మారాడగా తెలియదు, మర్మమే లేదు/ అన్నదమ్ముల మధ్య మెప్పుగా పెరిగింది... బంధాల విలువ బహు బాగ తెలియు పెద్దలంటే భక్తి పిల్లలంటే ప్రేమ సంశయమే లేదు సరైన జోడి మీ ఇంటి బిడ్డగా ఆదరించండి అంటూ... తల్లిదండ్రులు కనిపించి పెళ్లి అని అనుబంధంతో పుట్టి నుండి మెట్టినింటికి సాగనంపే క్రమంలో చిన్నప్పటి నుంచి ప్రేమను పంచి పెట్టిన తన బిడ్డపై చూపిస్తున్న మమకారాన్ని అంతే మొత్తంలో మీరు ఆశీర్వదించి తన బిడ్డపై ప్రేమను కురిపించాలని అప్పగింతల సమయంలో ప్రతి తల్లిదండ్రుల హృదయాల నుండి వచ్చే భావోద్వేగపూరితమైన సహజమైన సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ కవనం తెలియజేస్తుంది.
69 విభిన్న అంశాలతో..
నా కల నా స్వర్గం కవితా సంపుటి నందు ఉక్కు మహిళ ఇందిరమ్మ, బంధం, పాలి కేక, వాసంతిక, కరోనా, విశ్వంలో నిస్వార్థం, చెరిగిపోని సంతకం, వర్ధిల్లు నా భారతమా, బాబాసాహెబ్, ఇదేమిటో, భుజం, వాలు పొద్దున రాగలు ఆకులు, మృతి లేని శృతి, రంగుల తిరోగమనం, ముఖంపై ముసుగులు, బాల్యం ఇలా 69 కవితలతో విభిన్న అంశాలతో ఈ సంపుటిని గోలి విజయ రాశారు. ఈ కవితలన్నింటినీ పరిశీలిస్తే కవయిత్రి సామాజిక కోణంలో పలు అంశాలలో ఒక సునిశిత భావాలతో అవగాహనతో రాయగలిగింది. మాతృ భూమిపై తనకున్న ప్రేమ, అపారమని వ్యక్తం అవుతుంది. ఆ విషయంలో దేశ నాయకులపై రాసిన కవితలు నిదర్శనం సాటి మహిళగా మహిళలపై విశ్వాసం.. చిన్నప్పుడు విద్య అభ్యసించిన కాలం నుండి గురించిన భావనలతో పాటుగా, పర్యావరణం, కాలుష్యం, మానవ జీవితంలో పెనవేసుకున్న అనుబంధాలు, సమాజ పురోగతి కోసం కచ్చితంగా పరిష్కార దిశగా కవనాన్ని సాగించడం, ఇలా అనేక కోణాలలో రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఇలాంటి కవితా సంపుటాలు తన కలం నుండి మరెన్నో రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా కల నా స్వర్గం విజయ గోలి రచించిన పుస్తక ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యమవుతాయి.
సమీక్షకులు
డా. చిటికెన కిరణ్ కుమార్
సాహితీవేత్త, విమర్శకులు
94908 41284