వైద్యం చేయాలీ సమాజానికి

by Ravi |
వైద్యం చేయాలీ సమాజానికి
X

బహు రుగ్మతలతో

పచ్చి పచ్చి గాయాలున్నాయి

పలు సమస్యల వాతలూ ఉన్నవి

ఈ సమాజం రొప్పుతూంది

రోగ రాగాలతో

బహుళ ఔషధాల మానవీయతతో

వివిధ రీతులలో వైద్యం చేయాలి

కొత్తగా సున్నితంగా ఈ సమాజానికి

నయమైతే మంచి పరిణామమే

లేకుంటే శస్త్రచికిత్స అనివార్యమే

అవినీతి అందలమెక్కింది తలపైన

అది నీతి పాఠాలకు లొంగదు

పూల ధిక్కార స్వరం రుచి చూపించు

దారికొస్తుంది తిన్నగా

మరే అస్త్రం అవసరం లేకుండా

పైరసీల పైరవీలు జంట వ్యాధులు

వెరైటీగా ట్రీట్మెంట్ కావాలి

వ్యధల బాధలన్నీ పరిహరించేలా

రాలుతున్నవి ఆకులు క్షణక్షణం

హరితహీన రుగ్మతలతో

నకనకలాడే వాకిట

చచ్చుబడ్డది పేదరికం

దీర్ఘ కాల మహమ్మారి

క్యాన్సర్ వ్యాధిలా ముదిరింది

సామాజిక రుగ్మతే పావర్టీ

వ్యాధి సమూల నిర్మూలనకు

శస్త్రచికిత్స చేయాలి దీనికి

ఆపైన

కీమో థెరపీతో పాటు

రేడియేషన్ థెరపీతో చికిత్స

చేయాలీ మొండి రోగానికి

మళ్లీ మొలకలతో నోళ్లు తెరవకుండా

వైద్యం చేయాలీ సమాజానికి

విలువలు పెంచే కొత్త రక్తం ఎక్కించి

ఇప్పుడు విలువల సేవలతో కదిలే

సామాజిక వైద్యులు కావాలి

నర నరాల నిండిన వ్యాధులను

వైద్యం వాహకమైతో నిర్మూలించగా

మనిషి సామాజిక వైద్యుడు కావాలి

ఆరోగ్యకర సమాజం కోసం

తమ తమ కలాలను

సారించాలి సృజనకారులు

సమాజ హితం కోరి

సహజ నేత్రాలతో స్పందించాలి


డా.టి.రాధాకృష్ణమాచార్యులు

9849305871

Advertisement

Next Story

Most Viewed