- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. వచ్చేనెల 1న పోలింగ్ జరుగనుంది. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం 6 గంటలతో బహిరంగ ప్రచారం ముగుస్తోంది. అంతేకాకుండా మద్యం దుకాణాలకు కూడా సీల్ వేయనున్నారు. సాయంత్రమే అబ్కారీ అధికారులు మద్యం దుకాణాల దగ్గర పరిశీలించారు. ఇప్పటి వరకు ఉన్న స్టాక్ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో దుకాణాల్లో అక్రమంగా మద్యం తరలిస్తారనే సమాచారంతో దుకాణాల్లో నిల్వలను రికార్డు చేసుకుని తాళం వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 1న రాత్రి 7 గంటల తర్వాత మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. సోమవారం, మంగళవారం మద్యం దుకాణాలకు సెలవు. దీంతో మద్యం ప్రియులు కూడా దుకాణాల ఎదుట బారులు తీరారు. రెండు రోజులు వరుసగా దుకాణాలకు తాళాలు వేయడం, ఇదే సందర్భంలో రెండు రోజులూ ప్రభుత్వ కార్యాకలపాలకు సెలవు ఉండటంతో మందు బాబులు రెండు రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు.