విచిత్రం.. మెడికల్ షాపులో మద్యం విక్రయం

by Anukaran |
విచిత్రం.. మెడికల్ షాపులో మద్యం విక్రయం
X

దిశ, ఏపీ బ్యూరో: మెడికల్ షాపులో మద్యం విక్రయాలు పెరగడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఐతే చదవాల్సిందే…. విశాఖపట్నంలోని లక్ష్మి పురం కాలనీలోని ఆర్కే మెడికల్ షాపులో మందులతో పాటు మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు ఆనోటాఈనోటా పాకి పోలీసులకి పాకింది. దీంతో సోదాలు నిర్వహించగా 7 మద్యం బాటిళ్లు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నూకరాజుని అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ షాపులో మద్యం అమ్మకాలతో కాలనీ వాసులు అవాక్కయ్యారు.

Advertisement

Next Story