- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సదాశివపేటలో లిక్కర్ మాఫియా.. సిండికేట్ పేరుతో మహా దోపిడీ
దిశ, సదాశివపేట: సదాశివపేటలో వైన్ షాపుల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న సదాశివపేట పట్టణానికి ఐదు వైన్ షాప్ లు, 2 బార్లు మంజూరయ్యాయి. మంజూరైన రోజు నుంచి వైన్ షాపులు సిండికేట్ గా ఏర్పడి ప్రతి సీసాపై అదనంగా పది రూపాయలు కంటే ఎక్కువ తీసుకుంటున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా సమయపాలన పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్ షాపుల వద్ద ఎందుకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గురువారం సాయంత్రం మహిళా భక్తులు సాయిబాబా ఆలయానికి వెళ్లే దారిలో మందు బాబులు హల్చల్ చేశారు. దీంతో మహిళా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైన్ షాపులు నియమనిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా వైన్ షాపులు, మందు బాబుల నుంచి తమకు ఇబ్బందులు ఎదురవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు, సంబంధిత శాఖ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా సిండికేట్ వ్యవహారాన్ని కూడా అంతిమొందించాలని వారు కోరుతున్నారు.
- Tags
- Liquor Mafia