లింగన్న.. మా మనసులో ఇంకా ఉన్నాడు

by Shyam |
లింగన్న.. మా మనసులో ఇంకా ఉన్నాడు
X

దిశ సూర్యాపేట: చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో లింగన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్బంగా మండారి డేవిడ్ కుమార్, గంట నాగయ్య మాట్లాడుతూ పీడిత, తాడిత, ఆదివాసీ ప్రజల పక్షాన పోరాడిన లింగన్న స్ఫూర్తి, ఆశయాలు నిరంతరం ప్రజల గుండె చప్పుల్లో స్పృశిస్తూనే ఉన్నాయన్నారు. లింగన్న అందించిన స్ఫూర్తితో మరింత ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్,డివిజన్ నాయకులు కారింగుల వెంకన్న, దేసోజు మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story