'రాజకీయాలకు అతీతంగా దీపాలు వెలిగించాలి'

by Shamantha N |   ( Updated:2020-04-05 07:31:27.0  )
రాజకీయాలకు అతీతంగా దీపాలు వెలిగించాలి
X

దిశ, న్యూస్‌ బ్యూరో: రాజకీయాలు పక్కనపెట్టి కరోన మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాడే సమయమిది. నేటి రాత్రి 9 గంటలకు ప్రతి ఇంటి గుమ్మం ముందు దీపం 9 నిముషాలు వెలిగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి .కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన ఓ పత్రిక ప్రక్రటన చేస్తూ.. ఈ సందర్భంగా పలు ఆంశాలు తెలిపారు. కేవలం లైట్స్ మాత్రమే అపి దీపాలు వెలిగించాలన్నారు. దీపం వెలిగించి అసతోమా జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా అంటూ చీకట్లు పారద్రోలుదామన్నారు. దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు 1930 కాల్ సెంటర్‌కి ఫోన్ చేయండని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈశాన్య రాష్ట్రాల వాళ్లు సహాయం కోసం 1944 కు ఫోన్ చేయాలన్నారు. డాక్టర్ల పై దాడి చేయడం సిగ్గుచేటు అటువంటి వారిని కఠినంగా ఆయా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవలన్నారు.

Tags: Lights, politics, helpline, helping, doctors, police, kishan reddy, central minister

Advertisement

Next Story