- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిగ్రీ కన్నా స్కిల్స్ ముఖ్యం.. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో నయా ట్రెండ్ !
దిశ, ఫీచర్స్ : మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాలంటే ఏం కావాలి? హయ్యర్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. లేకుంటే కనీసం డిగ్రీ పాసై ఉండాలి అంటుంటారు చాలామంది. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మారే చాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు దేశాల్లో యూనివర్సిటీ డిగ్రీ కెరీర్ అవకాశాలకు గోల్డెన్ టికెట్ అని భావించే రోజులు పోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బోర్డ్ రూములు, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్లలో అకడమిక్ క్రెడిన్షియల్ ప్రాధాన్యతలు తగ్గుతున్నాయి. డిగ్రీలు ఉండి స్కిల్స్ లేని వారికంటే, డిగ్రీ లేకపోయినా తగిన నైపుణ్యం ఉన్న వారినే తమ సంస్థల్లో నియమించుకోవడానికి రిక్రూటర్లు మొగ్గు చూపుతున్నారు.
73 శాతం అదే ప్రయారిటీ..
చాలా వరకు కంపెనీలు రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా సామర్థ్యాల విలువలను గుర్తిస్తు్నాయి. నైపుణ్యాలను ఉపాధికి కొత్త కరెన్సీగా మారుస్తున్నాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మూడువేల మంది ఉద్యోగులను, యజమానులను సర్వే చేసిన ప్రముఖ సంస్థ టెస్ట్ గొరిల్లా (TestGorilla’s) యొక్క ది స్టేట్ ఆఫ్ స్కిల్స్ బేస్ట్ హైరింగ్ రిపోర్ట్ ప్రకారం.. 73 శాతం కంపెనీలు ఇప్పుడు నియామక ప్రక్రియలో స్కిల్స్ ఆధారిత మదింపులను కలిగి ఉంటున్నాయి. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం ఈ ప్రాసెస్ 26 శాతం పెరిగింది. యునైటెడ్ స్టేట్స్‌లో అయితే ఇక్కడి యజమానుల ప్రయారిటీ లిస్టులో డిగ్రీల విలువ పడిపోయిన కారణంగా ఇటీవల స్కిల్స్ బేస్డ్ రిక్రూట్‌మెంట్స్ పెరుగుతున్నాయి.
మారుతున్న రూల్స్..
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, యాపిల్ వంటి ఫేమస్ కంపెనీలు కూడా ఇటీవల నియామకాల్లో ప్రవేశ అడ్డంకులను తొలగించడానికి, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి తమ లాంగ్ హెల్డ్ డిగ్రీ రిక్వాయిర్మెంట్స్ రూల్స్ తొలగించాయని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల ఈ సంస్థలు హయ్యర్ ఎడ్యుకేషన్ కంటే కూడా నైపుణ్యాల ఆధారంగా ఎంప్లాయీస్‌ను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. గతంకంటే ఐదు రెట్లు ఎక్కువగా స్కిల్స్ ఆధారిత నియామకాలను చేపట్టాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం యూరప్ టాలెంట్ ల్యాండ్ స్కేప్‌లో కేవలం డిగ్రీలు అంత విలువైనవిగా ఉండటం లేదు. ఎందుకంటే ఇంతకాలం ఈ ప్రాసెస్ వల్ల చాలా నష్టపోయినట్లు ఇక్కడి బడా కంపెనీలు, వివిధ ఉద్యోగ నియామక సంస్థలు పేర్కొంటున్నాయి.
నయా ట్రెండ్
నైపుణ్యాలను పట్టించుకోకుండా కేవలం డిగ్రీలు, సర్టిఫికేషన్ ప్రాసెస్‌ను అనుసరించడంవల్ల ప్రస్తుతం యూరోపియన్ లేబర్ మార్కెట్ కష్టాలను ఎదుర్కొంటోందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇక్కడ డిగ్రీలకంటే స్కిల్స్ ముఖ్యమని చాలా కంపెనీలు, సంస్థలు భావిస్తున్నాయి. పైగా ఇక్కడ నైపుణ్యం కలిగిన నిపుణులకోసం డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా వర్క్ ఫోర్స్‌లో ఇప్పుడు స్కిల్స్ బేస్డ్ నియామకాలవైపు మళ్లడం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒక సరికొత్త ట్రెండ్ అని, ప్రపంచ వ్యాప్తంగా 56 శాతం కంపెనీల యాజమాన్యాలు డిగ్రీలు లేకపోయినా సరే, కేవలం స్కిల్స్ ఉంటే చాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే కొన్ని ప్రభుత్వ సెక్టార్లు, అలాగే ఫైనాన్స్, బిజినెస్ ఇండస్ట్రీస్ మాత్రం యూనివర్సిటీ డిగ్రీలతో సహా స్కిల్స్‌కు ప్రయారిటీ ఇస్తున్నాయి.
ఇ-కామర్స్‌లో ..
పారిస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్ లీడర్ అయిన OpenText, కోల్డ్ కాలింగ్, కోల్డ్ ఇమెయిల్ సోషల్ మీడియా వంటి సంస్థలు జస్ట్ చదువుకొని ఉండి, స్కిల్స్ ఉంటే చాలు.. డిగ్రీలు పట్టించుకోవడం లేదు. కాకపోతే B2B లీడ్ జనరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్‌పై కొంచెం బేసిక్ అండర్ స్టాండింగ్ కలిగి ఉండాలి. మరికొన్ని సంస్థలు డిగ్రీలు లేకున్నా సరే ఫ్రెంచ్ అండ్ ఇంగ్లిష్‌లో స్ట్రాంగ్ ఇంటర్ పర్సనల్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు ఉద్యోగులు ఇచ్చేస్తున్నాయి. అడిడాస్ ప్రొడక్ట్ లాంచ్ అండ్ డేటా EU eCom కూడా డిగ్రీలకంటే స్కిల్స్‌కు ప్రయారిటీ ఇస్తున్నది.