- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Workplace Disturbance : పనికి ఆటంకం కలిగించే ప్రవర్తన.. వర్క్‌ప్లేస్‌లో ఏం చేయకూడదంటే..
దిశ, ఫీచర్స్ : ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోయారా?.. వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఓ సారి మీ వర్క్ ప్లేస్ బిహేవియర్‌ను కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే కార్యాలయాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, పనికి ఆటంకం కలిగించే ఇతరుల ప్రవర్తన కూడా మీ మానసిక ఆరోగ్యంపై, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వర్క్‌ప్లేస్‌లో అలాంటి డిస్టర్బింగ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
ఏదో పనిలో బీజీగా ఉంటారు. కొద్దిసేపు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుంటే బాగుండు అనుకుంటారు. కానీ పని మధ్యలో ఉండగానే మీ క్లోజ్ ఫ్రెండో, వర్క్ ప్లేస్‌లోని కొలీగో వచ్చి మాట్లాడటం ప్రారంభించారనుకోండి!.. అప్పుడెలా అనిపిస్తుంది? బయటకు చెప్పకపోవచ్చు కానీ ఆ క్షణంలో అవతలి వ్యక్తిపట్ల కోపం వస్తుంది. ఇది రోజూ కొనసాగితే అవతలి వ్యక్తిపట్ల మీలో ప్రతికూల భావం ఏర్పడుతుంది. కాబట్టి వర్క్‌ప్లేస్‌లో ఇలాంటి ప్రవర్తనను అవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.
అర్థం చేసుకోని సందర్భాలు
వర్కులో ఉన్నప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వ్యవహరించేవారిని ఎవ్వరైనా సరే మీరేం అనుకుటారు? చాలామంది తమ పనికి ఆటంకం కలిగించే ఇలాంటి సందర్భాల్లో అవతలి వారిని క్రమశిక్షణ లేనివారిగా, హుందాతనం తెలియని వ్యక్తులుగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు అలా బిహేవ్ చేసినా అవతలి వ్యక్తి కూడా అలాగే అనుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. ఇదే ‘వర్క్ ప్లేస్ డిస్టర్బెన్స్’అంటే.. కాబట్టి కార్యాలయాల్లో సందర్భోచితం కానటువంటి ప్రవర్తనలను నివారించాలి.
ప్రశ్నలతో విసుగెత్తించే రకం
సమయం, సందర్భం లేకుండా అడిగే డౌట్లు కూడా వర్క్‌ప్లేస్‌లో ఇతరుల పనికి ఆటంకం కలిగిస్తాయి. వాస్తవానికి ప్రశ్నలు అడగడాన్ని ఎవరైనా మెచ్చుకుంటారు. తెలియని విషయం తెలుసుకోవడంలో ఇది ముఖ్యం కూడాను. కానీ అదే పనిగా డౌట్లతో చంపేస్తుంటే మాత్రం అవతలి వ్యక్తికి చిర్రెత్తుకొస్తుంది. వారి పనికి ఆటంకం కలుగుతుంది. ఈ సమస్యను ఫేస్ చేస్తున్నప్పుడు కూడా కొందరు అవతలి వారు తమ కోలీగో, ఫ్రెండో అయ్యుంటారు కాబట్టి ఏమీ అనలేకపోతారు. కానీ వర్క్ పరంగా డిస్టర్బ్ అవుతారు. అర్థం చేసుకొని మసలుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.
వ్యక్తిగత ఆసక్తులను రుద్దకండి
ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసర్ లాగే ఉండండి. ఖాళీ సమయం దొరికితే ఆఫీసు విషయాలు మాట్లాడుకోవడం, వర్క్ గురించి డిస్కస్ చేయడం వాస్తవానికి మెరుగైన పనితీరుకు సహాయపడుతుందని నిపుణులు చెప్తుంటారు. కానీ కొందరు వ్యక్తిగత ఆసక్తులను, అభిప్రాయాలను ఇతరులపై రుద్దాలని చూస్తుంటారు. తమ వర్క్ మధ్యలో వదిలిపెట్టి, ఇతరుల వద్దకు వెళ్లి తమ ఆసక్తులన్నీ చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇద్దరి పనికీ ఆటంకం కలుగుతుంది. వర్క్‌ప్లేస్‌లో ఇలాంటి బిహేవియర్ ఎవరిలో ఉన్నా నివారించదగ్గదే.
టెక్నాలజీ దుర్వినియోగం
పని ప్రదేశమంటే వాస్తవానికి హుందాగా ఉండాలంటారు. అప్పుడే ప్రొడక్టివిటీలో నాణ్యత వస్తుంది. కానీ కొందరి ప్రవర్తన ఈ వాతావరణాన్ని చెడగొట్టేలా ఉంటుంది. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా మొబైల్ ఫోన్‌లో సౌండ్ పెంచి మ్యూజిక్ వినడం, కూని రాగాలతో ఇరులను డిస్టర్బ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన సదరు వ్యక్తికే కాదు, అవతలి వ్యక్తి పనికి కూడా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి కార్యాలయాల్లో అలాంటివి చేయకపోవడం మంచిది.
హెల్త్ బాగా లేనప్పుడు కూడా..
ఎలాంటి వారికైనా అప్పుడప్పుడూ సమస్యలు, అనారోగ్యాలు తలెత్తుంటాయి. ఇలాంటప్పుడు యాజమాన్యాలు కూడా అర్థం చేసుకుంటాయి. సెలవులు అడిగినా ఇస్తారు. కానీ కొందరు అలాంటి చాన్స్ ఉన్నా సద్వినియోగం చేసుకోరు. పర్సనల్ ఇంట్రెస్ట్ కోసమో, ఇంట్లో బోర్ కొడుతుందనో ఆఫీసుకు వస్తారు. ఇక హెల్త్ బాగో లేదు కాబట్టి పని ఎలాగూ చేయకపోగా.. ఆ రోజు తమ హెల్త్ ఎందుకు బాగో లేదో, ఉదయం నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో, తర్వాత ఏం చేయబోతున్నారో ఇలా ప్రతీ విషయాన్ని చెప్తూ డిస్టర్బ్ చేస్తుంటారు. ఈ విధమైన ప్రవర్తన అవతలి వ్యక్తికి నచ్చకపోగా పనికి ఆటంకం కలిగిస్తుంది. మీ పట్ల గౌరవ భావాన్ని దూరం చేసి, చులకన భావం ఏర్పడేలా చేస్తుంది.
అతి జోక్యంతో అవస్థలు
పని ప్రదేశంలో కొలీగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా అక్కడున్నంత సేపు ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేయడం మీలోని క్రమశిక్షణకు నిదర్శనంగా భావిస్తారు. కానీ కొందరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అవసరం లేకపోయినా.. ఇతరుల పనిలో జోక్యం చేసుకుంటారు. అడగకపోయినా సలహాలు ఇస్తుంటారు. దీనివల్ల అవతలి వ్యక్తి పనికి ఆటంకం కలుగుతుంది. కాకపోతే మీతో ఉన్న క్లోజ్‌నెస్ కారణంగానో, ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకనో, హర్ట్ అవుతారనో ఏమీ అనలేకపోతారు. కానీ దీనివల్ల ఆ రోజు చేయాల్సిన పనిలో నాణ్యత తగ్గవచ్చు. కాబట్టి పని ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తను అవైడ్ చేయాలంటున్నారు నిపుణులు. అవతలి వ్యక్తి విషయంలోనైనా, అవతలి వ్యక్తి మీ విషయంలోనైనా సరే.. అతి చొరవ, అతి జోక్యం అనర్థదాయకమని గుర్తించండి.