నలుపు రంగు గాజులు వేసుకునే మహిళలు వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!

by Prasanna |
నలుపు రంగు గాజులు వేసుకునే మహిళలు వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: హిందూ మతంలో నలుపు రంగుకు చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే బ్లాక్ కలర్ ను అశుభంగా పరిగణిస్తారు. ఇది శుభ కార్యాలయాలకు అస్సలు ఉపయోగించరు. ఈ రంగును ధరించడం వలన చెడు దృష్టి పడుతుందని నమ్ముతారు. పెళ్లయిన మహిళలు నలుపు రంగు గాజులు, చీరలు ధరించరు. కానీ, ఇప్పుడు కాలం మారింది. స్త్రీలు తమ అందం గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. అందుకే బ్లాక్ కలర్ చీరలు, గాజులు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. మరి, నలుపు రంగు గాజులు ఎందుకు వేసుకోకూడదు? వేసుకుంటే ఏమి జరుగుతుంది? ఎలాంటి ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

నలుపు రంగు గాజులు ఎందుకు ధరించాలి

చాలా చోట్ల కొత్తగా పెళ్లైన వారు బ్లాక్ కలర్ గాజులు వేసుకుంటారు. ఎందుకంటే ఈ రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

నలుపు రంగు గాజుల ప్రభావం

కొన్ని చోట్ల నలుపు రంగు అశుభమని చెబుతారు. మహిళలు వీటిని అస్సలు ధరించకూడదని అంటున్నారు. పెళ్లయిన స్త్రీలు కొద్ది రోజులపాటు ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులు తప్ప.. బ్లాక్ కలర్ గాజులు అసలు ధరించకూడదు. ఒక వేళ ఈ గాజులు వేసుకుంటే భార్య భర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story