- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చర్మానికి పోషణను ఇచ్చే మెన్‌స్ట్రువల్ బ్లడ్.. ఫేస్ మాస్క్‌గా వాడుతున్న అమెరికన్
దిశ, ఫీచర్స్: ఎంత సాంకేతిక పురోగతి సాధిస్తే ఏం లాభం.. అమ్మాయిల నెలసరి కష్టాలకు మాత్రం పరిష్కారం లేదు. మహా అంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.. శానిటరీ పాడ్స్, మెన్‌స్ట్రువల్ కప్స్ విరాళాలుగా అందించడం తప్ప ఆ బాధను షేర్ చేసుకోలేకపోతున్నాం. పైగా ఇప్పటికీ పీరియడ్స్ గురించి మాట్లాడడాన్ని అవమానం, అపవిత్రం అని భావించే వారు లేకపోలేదు. కానీ ఇదే మెన్‌స్ట్రువల్ బ్లడ్.. 'అత్యంత పవిత్రం, అన్నింటికీ మూలం' అని చెప్తోంది అమెరికాకు చెందిన మహిళ.
న్యూజెర్సీలో నివాసముండే గీనా ఫ్రాన్స్ (28) పీరియడ్ టైమ్ ఫేస్ చేయాలంటే భయపడిపోయేది. అందుకే ఎనిమిదేళ్ల పాటు రుతుక్రమాన్ని స్కిప్ చేసేందుకు టాబ్లెట్స్ వాడింది. కానీ ఆ తర్వాత రుతుక్రమం పవర్ గురించి తెలుసుకున్న ఆమె... దీని గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. పీరియడ్స్ బ్లడ్ ఒళ్లంతా పూసుకున్న ఫొటోలతో దర్శనమిచ్చే గీనా.. మనలో ఉన్న ఈ రక్తమే మనల్ని మనం కనెక్ట్ చేసుకునేందుకు దారి చూపే గొప్ప ఆయుధమని చెప్తోంది. ఈ రక్తాన్ని పూర్వీకుల నుంచి సంక్రమించిన అద్భుత ఔషధంగా అభివర్ణిస్తోంది. 'మెన్‌స్ట్రువల్ బ్లడ్ మూలకణాల మూలం' అని వివరిస్తున్న ఆమె.. దీనిని 'నేచురల్ ఫేస్ మాస్క్'గా వాడటం వల్ల చర్మానికి పోషణ లభిస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ రక్తంతోనే పెయింటింగ్, డ్రాయింగ్ చేయడంతో పాటు మొక్కలకు ఎరువుగా కూడా యూజ్ చేస్తోంది. ఇకపై మెన్‌స్ట్రువల్ కప్‌లో రక్తాన్ని సేకరించి.. ఎంతటి అద్భుతాలకు సాక్షంగా నిలుస్తున్నారో చెప్పాలని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కోరుతుంది.