మత్స్యకన్యగా మారిన యువతి.. నగ్నఫొటోలతో నెలకు రూ.6 లక్షల సంపాదన

by sudharani |   ( Updated:2023-06-07 12:57:55.0  )
మత్స్యకన్యగా మారిన యువతి.. నగ్నఫొటోలతో నెలకు రూ.6 లక్షల సంపాదన
X

దిశ, ఫీచర్స్: మత్స్యకన్యగా సముద్రంలో సేదతీరాలని ప్రతీ యువతి కలలు కంటుంది. ముఖ్యంగా స్విమ్మింగ్ అంటే ఇష్టమున్న అమ్మాయిలకు పెరిగేకొద్ది ఈ ఆశ అధికం అవుతుంది. కానీ ఆ కలను సాకారం చేసుకునేవారు లేకపోగా.. అమెరికాకు చెందిన ఎమిలీ అలెగ్జాండ్రా మాత్రం మత్స్యకన్యగా రూపాంతరం చెంది, తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకుంది. తద్వారా నెలకు ఆరు లక్షలు సంపాదిస్తోంది.

చిల్డ్రెన్ పార్టీస్, ఫైవ్ స్టార్ ఈవెంట్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఆహ్వానించబడుతున్న ఆమె.. స్విమ్మింగ్ పూల్స్‌లో రోజుల తరబడి గడుపుతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికలపై షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకుని పెద్ద మొత్తంలో సంపాదిస్తోంది. ఇక తన వృత్తిలో మరో కోణం ఉందని, పురుషులు మత్స్యకన్య అవతార్‌లో టాప్‌లెస్ ఫొటోలు షేర్ చేయమని అడుగుతారని తెలిపింది. అలా ఓన్లీ ఫ్యాన్స్ యాప్ ద్వారా కూడా డబ్బులు పొందగలుగుతున్నానని చెప్పుకొచ్చింది.

'చిన్నప్పుడు వారాంతంలో బీచ్‌కు వెళ్లి సముద్రంలో ఈత కొడుతున్నప్పుడు మత్స్యకన్యగానే భావించేదాన్ని. అప్పటి నుంచి ఆ భావం నాలో పాతుకుపోయింది' అంటున్న ఎమిలీ.. 22ఏళ్ల వయసులో ఫొటోషూట్ కోసం మెర్మైడ్ మాదిరిగా తోకను పొందాలని నిర్ణయించుకున్నానని, ఇందుకోసం రెండున్నర లక్షలు ఖర్చుచేశానని తెలిపింది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో తనకు డిమాండ్ పెరిగిందని వివరించింది. ఆ విధంగా చిన్నపిల్లల కోసం మత్స్యకన్యగా మారి వారిని సంతోషపరచడం ప్రత్యేకంగా భావిస్తున్నానన్న ఆమె.. శాంటా క్లాజ్‌ని నమ్మినట్లే తాను నిజమైన మత్స్యకన్యని పిల్లలు నమ్ముతారని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని అంటోంది. ఇక అమెరికన్ మెర్మైడ్‌గా పేరొందిన ఎమిలీ.. తోకను పెట్టుకోవడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుందని, ఇందుకోసం లూబ్రికేట్ ఉపయోగించాలని వివరించింది. అంతేకాదు మత్స్యకన్య కెరీర్‌‌ కోసం బాయ్ ఫ్రెండ్ ఇస్తున్న మద్దతు మాటల్లో చెప్పలేనిదని తెలిపింది. తెరవెనుక ఉండి సహాయం చేస్తున్న అతను.. మిగతా పురుషులు తనతో సాసీ స్నాప్స్, వీడియోలకు పోజులివ్వమని అడిగినప్పుడు సెక్సీగా ఫీల్ అవుతాడని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story