భూమి నిరంతరం తిరుగుతున్నా.. కదులుతున్నట్లు ఎందుకు అనిపించదు?

by Javid Pasha |
భూమి నిరంతరం తిరుగుతున్నా.. కదులుతున్నట్లు ఎందుకు అనిపించదు?
X

దిశ, ఫీచర్స్ : మానవ మనుగడలో భూగోళం కేంద్ర బిందులో. శాస్త్రవేత్తలు అనేక రహస్యాలు ఛేదించినా అంతు చిక్కని విషయాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. కొంగ్రత్త ఆవిష్కరణలు బయటకు వచ్చినప్పుడల్లా మనలో క్యూరియాసిటీని పెంచుతుటాయి. అయితే మనం నివసిస్తున్న భూమి ఎప్పుడూ తన చుట్టూ తాను తిరుగుతుందనన విషయం తెలిసిందే. అయినా కదిలినట్లు ఎందుకు అనిపించదు అనే సందేహం చాలా మందిలో వ్యక్తం అవుతూ ఉంటుంది. దీనికి కారణమేంటో తెలుసుకుందాం.

* నిపుణుల ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందని, దీనిని ఒక రోజుగా పిలుస్తామని మనకు తెలిసిందే. అయితే తనచుట్టూ తాను తిరిగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో అయితే గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అయినా మనకు కదిలినట్లు మాత్రం కనిపించదు.

* భూమి కదిలినట్లు ఎందుకు అనిపించదో తెలిపేందుకు చిలీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్టులు కొన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. జస్ట్ మీరు ఒక విమానంలో ఉన్నట్లు ఊహించుకోండి. అది టేకాఫ్ అయినప్పుడు సీటులో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ విమానం నిర్దిష్ట వేగానికి చేరుకున్నన తర్వాత ఎలాంటి కదలిక ఉండదు. సరిగ్గా భూమి విషయంలో అదే జరుగుతుంది. స్థిరమైన వేగంతో తిరుగుతుండడం కదులుతున్నట్లు అనిపించదు.

* భూమి నిరంతరం తిరుగుతున్నా మనుషులకు అది తిరుగున్నట్లు అనిపించకపోవడానికి గురుత్వాకర్షణ శక్తి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అంటే భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫుగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. వాస్తవానికి ఇది మనల్ని అంతరిక్షంలోకి విసిరి పడేసేంత బలమైనది కానీ భూమి గురుత్వాకరణ శక్తి దీనికంటే కూడా బలమైది కాబట్టి మనం గ్రహానికి అతుక్కుని ఉంటాం. అలాగే భూమి కదలిక కారణంగా మైకం కలగకుండా జీవరాశుల్లో శ్రవణ వ్యవస్థ ఏర్పడిందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాతావరణం కూడా భూమితోపాటు అదే వేగంతో స్థిరంగా కదలడం, గాలిపొర కూడా అంతే వేగంతో పరిభ్రమించడం కారణంగా భూమి తిరుగుతున్నప్పటికీ కదిలినట్లు తోచదు.

Advertisement

Next Story

Most Viewed