నల్లటి వస్తువులు తర్వగా వేడెక్కుతాయి... ఎందుకు?

by S Gopi |
నల్లటి వస్తువులు తర్వగా వేడెక్కుతాయి... ఎందుకు?
X

దిశ, వెబ్ డెస్క్: నల్లటి వస్తువులు తర్వగా వేడెక్కుతాయి... ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు ఎర్రగా ఉందంటే అది తన రంగుని మినహాయించి ఇతర రంగులను శోషించుకుంటుంది. అంటే ఆయా రంగుల్లోని వస్తువులు తమ తమ రంగులను కాకుండా మిగిలిన దృశ్యకాంతిలోని భాగాలను గ్రహిస్తుంటాయి. దృశ్యకాంతిలోని మొత్తం ఏడు రంగుల్లో దేనినీ శోషించుకోనట్లయితే ఆ వస్తువును తెల్లటి వస్తువుగా పరిగణిస్తారు. ఇక అన్ని రంగుల్ని శోషించుకునే వస్తువు ఏంటంటే నలుపు రంగు. కాంతిశక్తిని ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆ వస్తువు అంత ఎక్కువగా వేడెక్కుతది. అన్ని రంగులను శోషించకునే గుణం నలుపు రంగుకు ఉన్నందున నల్లని వస్తువులు త్వరగా వేడెక్కుతాయంట.



Next Story

Most Viewed