Congress leaders : అంగన్వాడీ టీచర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు ఆపాలి..

by Sumithra |
Congress leaders : అంగన్వాడీ టీచర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు ఆపాలి..
X

దిశ, నాగర్ కర్నూల్ : అంగన్వాడీ టీచర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు ఆపాలి అని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట్ నియోజకవర్గం, ఉప్పునుంతల మండలం, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ శారద కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందన్నారు. అంగన్వాడి టీచర్ కుటుంబ సభ్యులు పార్టీ మారలేదనే అక్కసుతో, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ కక్ష పూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అంగన్వాడీ టీచర్ శారద మామ వృద్ధాప్య పెన్షన్ ను అధికార బలంతో తీసి వేయించారని, ఫైనాన్స్ లో లోన్ తీసుకుంటే ఆ లోన్ కట్టిన కూడా కట్టనట్లు సర్పంచ్ వేధింపులకు గురి చేయడం, భూమి విషయాల్లో జోక్యం చేసుకుని కుటుంబాన్ని అభాసుపాలు చేయడం, జాబ్ లోంచి తీసివేసే వరకూ ఊరుకోము అనీ మాజీ సర్పంచ్ కొడుకు మాట్లాడటం తగదని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినా పేదల పై వివక్ష, అవమానాలు, వేధింపులు ఆగకపోవడం హేయనీయం అన్నారు. అచ్చంపేట్ ఎమ్మెల్యే ఎస్సీల పై వివక్ష చూపిస్తే మరి ఎస్సీలకు ఎక్కడ రక్షణ దొరుకుతుందని ప్రశ్నించారు. శారద కుటుంబ సభ్యులను వేధించిన మాజీ సర్పంచ్, అతని కుమారుని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ శారదకు న్యాయం జరిగే వరకూ బీఎస్పీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం అందజేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed