- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కక్షపూరితంగానే బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు

దిశ, హత్నూర : పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి వచ్చిన గనియమైన ఓటర్లను జీర్ణించలేక బీజేపీ కార్యకర్తల కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టారని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శనివారం కంది జైలులో ఉన్న బీజేపీ కార్యకర్తల పరిస్థితులను తెలుసుకొని వారికి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామంలో కక్ష పూరితంగా హత్నూర ఎస్సై బీజేపీ కార్యకర్తలను రిమాండ్ కు పంపించారని, గతంలో రెడ్డిఖానపూర్ గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చిన గణనీయమైన ఓట్లు, బీజేపీకి పెరుగుతున్న మద్దతు దృష్ట్యా జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు.
వెంటనే జిల్లా ఎస్పీ న్యాయమైన విచారణ జర్పించి హత్నూర ఎస్సై ను వెంటనే విధుల నుండి తొలగించాలని అయిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు కొండాపూర్ జగన్, బీజేపీ హత్నూర మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్, బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ కో కన్వీనర్ ఎర్ర సతీష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజమల్ల రెడ్డి, మండల నాయకులు ప్రభాకర్, రాజు, శ్రీశైలం, మల్లేష్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.