- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad : వయనాడ్ వరద బాధితులకు అండగా ఉందాం...
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : కేరళ రాష్ట్రం వయనాడ్ ప్రాంతంలోని వరద బాధితులకు అండగా ఉందామని, అన్ని విధాలుగా సహకారం అందించి ఆదుకుందామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ కోరారు. వరద బాధితుల సహాయార్థం సీపీఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో కొండచరియలు విరిగిపడి వాగులు వంకలతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాదిమంది గాయాలపాలై క్షతగాత్రులుగా సర్వం కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వారందరిని మానవత దృక్పథంతో ఆదుకోవడానికి ప్రజలు రాజకీయాలకతీతంగా ముందుకు వచ్చి అన్ని విధాల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , చీమల కొండూరు శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.