మార్పు వచ్చేనా...?

by Sumithra |
మార్పు వచ్చేనా...?
X

దిశ, భిక్కనూరు : ఒక పూట వండుకు తినే కూరగాయలను ఏ విధంగా ఏరి కోరి.. కొంటామో, ఐదేళ్లు పాలించే నాయకుని విషయంలో ఎంతగా ఆలోచించాలి.. యువత మేలుకో అంటూ వెలసిన ఫ్లెక్సీలు పట్టణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని స్థానిక సినిమా టాకీస్ చౌరస్తాలో సెంటర్ లైటింగ్ పైలాన్ చుట్టూ గంగల రవీందర్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. వ్యవస్థ సరిగా లేదు, ఎలా మార్చాలో తెలుసు..

కాని మన చేతిలో మార్చడానికి అధికారం లేదు, సమయం వచ్చింది అందుకే చేతులు కలపండి మిత్రమా అంటూ ఫ్లెక్సీలపై యూత్ ను ఎంకరేజ్ చేస్తూ పెట్టిన మెసేజ్ లు ఆలోచనన లో పడేలా చేశాయి. పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువుకున్న ప్రజాస్వామ్యం గురించి. పాతికేళ్లు వచ్చాక కూడా మనలో ప్రశ్నించే తత్వం రాకపోతే, పనికిరాని వాళ్లే పరిపాలిస్తూ వ్యవస్థను సర్వనాశనం చేస్తూనే ఉంటారు. అందుకే చరిత్ర తిరగరాయాలన్నది నా తపన. ఉద్యోగం రాలేదని, రాజకీయాల్లో ఎందుకులేనని బాధపడకుండా ఇకనైనా మేల్కొని వ్యవస్థ మార్పు కోసం, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనన్నది ఆ ఫ్లెక్సీ ల పై ఉన్న సారాంశం.



Next Story

Most Viewed