వెబ్‌ సైట్లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ‘ఆర్ యు హ్యూమన్ ?’ అని ఎందుకు అడుగుతాయి?

by Javid Pasha |
వెబ్‌ సైట్లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ‘ఆర్ యు హ్యూమన్ ?’ అని ఎందుకు అడుగుతాయి?
X

దిశ, ఫీచర్స్ : మనం ప్రతిరోజూ ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లలో పలు వెబ్‌సైట్లను బ్రౌజ్ చేస్తుంటాం. చాలా వరకు క్లిక్ చేయగానే హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. కానీ కొన్ని సైట్లు మాత్రం వెంటనే ఓపెన్ కావు. బ్రౌజ్ చేస్తున్న క్రమంలో క్యాప్చ (CAPTCHA) ప్రత్యక్షం అవుతుంది. అలాగే సదరు బెబ్‌సైట్ ‘ఆర్ యు హ్యూమన్?’ అని అడుగుతుంది? ఎందుకిలా? జరుగుతుంది అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా?

వాస్తవానికి క్యాప్చ(CAPTCHA) అనేది మనుషులు, కంప్యూటర్లను విభజిస్తుంది. లాగిన్ అయి, ఆయా సైట్లను సెర్చ్ చేసే వ్యక్తుల కోసం ఇది రూపొందించబడిందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఆయా వెబ్‌ సైట్లను సెర్చ్ చేస్తున్నది టెక్నాలజీతో రూపొందించబడిన AI నా? లేదా నిజమైన మనిషా? అనేది తెలుసుకోవడానికి పలుసైట్లు ఈ ప్రశ్న అడుగుతాయి. ఎందుకంటే కంప్యూటర్లకంటే క్యాప్చను పరిష్కరించడం మానవులకు ఈజీ. అయితే మీరు నిజమైన వ్యక్తి అని, కంప్యూటర్ ప్రోగ్రామ్ లేదా ఛాట్ బాట్ కాదని ధృవీకరించడానికి సైట్లలో ఈ విధమైన ప్రశ్నలు అడిగేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ నిపుణుల ద్వారా ముందుగానే పొందు పరచబడి ఉంటుంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్‌లు (బాట్స్) వెబ్‌ సైట్లను యాక్సెస్ చేయడం లేదా ఇంటరాక్ట్ అవడం వంటి రిస్క్ నుంచి తప్పించడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed