వాటర్ బాటిళ్ల పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు ఉంటుంది..? ఇదే కారణం!

by Sumithra |
వాటర్ బాటిళ్ల పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు ఉంటుంది..? ఇదే కారణం!
X

దిశ, వెబ్‌డెస్క్ : దూరప్రయాణాలు చేసేసమయంలో చాలా మంది బస్టేషన్లలో, రైళ్లలో, సమీపంలో ఉండే దుకాణాల్లో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటాం. చాలావరకు కంపెనీలు స్వచ్ఛమైన మినరల్ వాటర్‌ని బాటిళ్లలో, చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి అమ్ముతారు. అయితే ఈ వాటర్ బాటిళ్ల పై ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ బాటిళ్లలో ఉండే నీళ్లు చాలా రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి. మరి వాటర్ బాటిళ్లపై ఎందుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని చాలా మందికి వచ్చే డౌట్. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నీటికి ఎక్స్‌పైరీ డేట్ లేకపోయినప్పటికీ నీటిని నిల్వ చేసే ప్లాస్టిక్ బాటిళ్లకు ఖచ్చితంగా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. గడువు ముగిసిన బాటిళ్లల్లోని నీటిని సేవిస్తే అందులో బాక్టీరియా ఫాం అయి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అలాగే ఎక్స్ పైరీ డేట్ దాటిన ప్లాస్టిక్ బాటిళ్లు నీటిలో కరగడం ప్రారంభిస్తుంది. అందుకే గడువు తేదీ ముగిసిన బాటిల్‌లోని వాటర్ తాగకూడదు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ కంపెనీల బాటిళ్లపై గడువుతేదిని సూచిస్తాయి. ఈ డేట్ ద్వారా ఎన్నిరోజుల వరకు ఆ వస్తువులను వినియోగించవచ్చో వినియోగదారులకు తెలియపరుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed