ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ద్రాక్షలో ఏది ఆరోగ్యానికి మంచిది

by Sumithra |
ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ద్రాక్షలో ఏది ఆరోగ్యానికి మంచిది
X

దిశ, ఫీచర్స్ : ద్రాక్ష పళ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ద్రాక్షపల్లలో నలుపు, ఎరుపు, పచ్చరంగులో ఉంటాయి. కొంతమంది ఎరుపు రంగు ద్రాక్షపండ్లను ఇష్టంగా తింటే మరికొంతమంది పచ్చరంగు ద్రాక్షలు ఎక్కువగా తింటారు. మరికొంతమంది నల్లని ద్రాక్షపండ్లను ఎక్కువగా తింటారు. అయితే ఎరుపు రంగు ద్రాక్షలు తక్కువగా దొరుకుతాయి. రంగుతో పాటుగా వాటి రుచులు కూడా మారుతూ ఉంటాయి. అయితే వీటిలో ఏ రంగు ద్రాక్షలు తింటే మంచిదో అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఏమి మంచివో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల ద్రాక్షలు..

నల్లరంగు ద్రాక్షపండ్లు గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నల్ల ద్రాక్షలను తింటే క్యాన్సర్ కణాలు క్షీణిస్తాయని, క్యాన్సర్ బారినపడకుండా చేస్తుందని చెబుతున్నారు. అలాగే విటమిన్లు సి, కె, కేలరీలు, ఫైబర్, ప్రోటీన్ వంటివి ఉన్నాయి. వీటిని డైరెక్టుగా కాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. వీటి రుచి పుల్లగా, తీయ్యగా ఉంటాయి.

ఎరుపు ద్రాక్ష..

ఈ ఎర్ర ద్రాక్షలు మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతాయి. సప్లై తక్కువ ఉండడంతో వీటి రేటుకూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని జామ్, జెల్లీలు తయారు చేసేందుకు వినియోగిస్తారు. వీటిలో ప్రోటీన్, కేలరీలు, ఫైబర్, విటమిన్లు సి, కె, లాంటి పోషకాలు ఉన్నాయి.

ఆకు పచ్చ ద్రాక్ష..

ఆకుపచ్చ ద్రాక్షలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్లు సి, కె, ప్రోటీన్, కేలరీలు, ఫైబర్ లు ఉన్నాయి. వీటిని సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed