- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఐవీఎఫ్ గర్భధారణ’ సురక్షితమేనా.. ఏ వయస్సులో ట్రీట్‌మెంట్ అవసరం?
దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో చాలామంది సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఐవీఎఫ్(In vitro fertilization), ఐయూఐ వంటి చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే వీటి గురించి కూడా చాలామందిలో పలు అనుమానాలు తలెత్తుతుంటాయి. ఈ చికిత్స ద్వారా పొందే గర్భధారణ సురక్షితమేనా? ఐవీఎఫ్‌కు వెళ్లే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలను తెలుసుకుందాం.
సంతానం ఆలస్యమైనవారు, లేదా సంతానలేమి సమస్యతో బాధపడేవారు ఆరోగ్యవంతమైన గర్భధారణకోసం ఐవీఎఫ్ విధానం సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. మహిళలో అండాశయం నుంచి విడుదలయ్యే అండాలను సేకరించి, బయటి వాతావరణంలో, అంటే.. బాహ్య ఫలదీకరణ గావించి తిరిగి సదరు మహిళ గర్భాశయంలో అభివృద్ధి చెందడానికి ప్రవేశ పెడతారు. ఇక ఫలదీకరణం మొదలు బిడ్డ ఎదుగుదల వరకు వైద్య నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతుంది. చాలామంది కొత్తగా పెళ్లయిన దంపతులు సంతానం ఇప్పుడే ఎందుని వాయిదా వేస్తుంటారు. అయితే 35 ఏండ్లకు మించిన వయస్సు వారు ఇలా చేయడం ఈ రోజుల్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే వయస్సు పెరిగినకొద్దీ ప్రస్తుత జీవనశైలి కారణంగా అండాల విడుదలలో లోపాలు, సంతానం కలుగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 35 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉన్నప్పుడే సంతాన సాఫల్యతకు, ఫెర్టిలిటీకి అకవాశాలెక్కువుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రీట్మెంట్ ఎప్పుడు ?
ఐయూఐ (Intrauterine insemination) అనేది స్పెర్మ్ గర్భాశయానికి చేరుకోవడంలో లోపం. ఇటువంటి సమస్య కలిగిన దంపతులకు చేసే ప్రారంభ చికిత్స విధానమే ఐయూఐ. ఇందులో రెండు మూడు సార్లు విఫలమైతే ఇక దాని గురించి వదిలేసి ఐవీఎఫ్ గురించి ఆలోచించాలి. చాలామందిలో సంతానలేమికి కారణం జీవనశైలిలో మార్పులు, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, ఇతర కారణాలవల్ల కూడా సమస్యలు తెలెత్తుంటాయి. మహిళల్లో హైపోథైరాయిడిజం పీసీఓడీ వంటి సమస్యలు గర్భధారణను అడ్డుకుంటాయి.
వీటికి దూరంగా ఉండాలి
సాంతానలేమి సమస్యతో ఎదుర్కొంటున్న దంపతులు ఆరోగ్య కరమైన జీవనశైలి ఏర్పర్చుకోవాలి. ధూమపానం, మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలను వాడటం వంటివి అస్సలు చేయకూడదు. ఇవి వ్యక్తుల్లోని లైంగిక పటుత్వాన్ని దెబ్బతీస్తాయి. పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత లోపించేందుకు, స్ర్తీలో అండాల విడుదలకు ఆటకం ఏర్పడుతుంది. అలాగే స్థాయికి మించిన మానసిక ఆందోళన వంటివి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతాయి. సహజమైన సంతాన సాఫల్యానికైనా, ఐయూఐ, ఐవీఎఫ్ వంటి పద్ధతుల్లో ప్రయత్నానికైనా ముందు దంపతులు ఆరోగ్యంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి: హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ 7 టిప్సే ప్రధానం