భయంకరమైన కలలు ఎప్పుడు పడతాయంటే..?

by Kalyani |   ( Updated:2023-06-29 12:13:37.0  )
భయంకరమైన కలలు ఎప్పుడు పడతాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఒక్కరూ వారు పెట్టుకున్న జీవిత లక్ష్యాన్ని సాధించే క్రమంలో రకరకాల ఒత్తిళ్లకు లోనవుతుంటారు. కొంతమంది కుటుంబ సమస్యలతో ఆందోళన చెందుతుంటారు. మరి కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమాయాల్లోనే చాలామందికి సరిగా నిద్ర పట్టదు. ప్రశాంతంగా నిద్ర పడితే అదే అదృష్టమని భావిస్తుంటారు. వయసుకు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యమని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే నిద్ర పోయినప్పుడు రకరకాల కలలు రావడం, నిద్రలోనే మాట్లాడడం వంటివి గమనిస్తూనే ఉంటాం.

కొన్నిసార్లు నిద్రలో వచ్చే కలలు చాలా భయంకరంగా ఉంటాయి. యాక్సిడెంట్ అయినట్లు, నీటిలో మునిగిపోతున్నట్లు, ఇతరులు మనపై దాడి చేస్తున్నట్లు, గొడవ పడినట్లు ఇలా రకరకాల కలలు వచ్చి నిద్రలోనే ఉలిక్కిపడే సందర్భాలు ఉంటాయి. అయితే పని ఒత్తిడి, మన శరీరం, మనసు బాగా అలసిపోయినప్పుడు ఇలాంటి పీడకలలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్‌తో బాధపడే వారికి ఎక్కువగా పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

Read More: ఆ యాప్ యూజర్స్‌లో 95శాతం రోబోలే.. కానీ రూ. 20కోట్ల ఫండ్స్ వచ్చాయి.. అలా ఎలా?

Advertisement

Next Story

Most Viewed